Aug 17,2023 22:10

సామూహిక గృహప్రవేశాలకు సిద్ధం చేయాలి
గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక అధికారి రామచంద్రారెడ్డి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌

రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు కల్పించాలనే లక్ష్యంతో పనిచేయాలని నిర్ణయించడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా నిర్మించ తలపెట్టిన 40 వేల గృహాలను వెంటనే పూర్తి చేయాలని గహ నిర్మాణశాఖ ప్రత్యేక అధికారి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం డిఆర్డిఏ మీటింగ్‌ హాల్‌లో గృహనిర్మాణ శాఖకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గృహ నిర్మాణాలకు సంబంధించి రాష్ట్రంలో చిత్తూరు జిల్లా మొదటిస్థానంలో ఉందని, అదేవిధంగా కొనసాగాలని రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి ఈకార్యక్రమం త్వరలో ప్రారంభించనున్నారని చిత్తూరు జిల్లాకు సంబంధించి జిల్లా మంత్రులు ప్రారంభిస్తారని తెలిపారు. గృహ నిర్మాణాలతో పాటు లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. గహ నిర్మాణానికి సంబంధించి ప్లాస్టింగ్‌, ఫ్లోరింగ్‌, డోర్లు, లోగో ఉండాలని అదేవిధంగా ఇండ్లకు సంబంధించి విద్యుదీకరణ పనులు, ప్రతి ఇంటికి ఒక లైటు ఉచితంగా చేయించాలన్నారు. 25 గృహ నిర్మాణాలు, ఆపై ఉన్న జగనన్న కాలనీలకు ఆర్చిల నిర్మాణం తప్పనిసరిగా చేయాలన్నారు. అప్రోచ్‌ రోడ్ల విషయంలో రాజీ లేకుండా పనులు పూర్తి చేయాలని అన్నారు. గృహ నిర్మాణ సముదాయాలలో ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరిగా చేపట్టాలని లేదంటే వర్షాకాలంలో కాలనీలలో మురికినీరు వచ్చే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరికి ఇంకుడు గుంత నిర్మాణం చేసి ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉందని వెంటనే మంజూరు చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. 458 లేఔట్లకు సంబంధించి 335 లేఅవుట్‌లో విద్యుదీకరణ పనులు పూర్తిఅయ్యాయని మిగతా కాలనీలలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ట్రాన్స్కో ఎస్‌ఈ శ్రీహరి తెలిపారు. గృహనిర్మాణాలు పూర్తి చేసుకున్న వారు దరఖాస్తు చేసిన 24గంటల్లో ఉచితంగా సర్వీస్‌ ఇవ్వడం జరుగుతుందని సాంక్షన్‌ లెటర్‌, ఆధార్‌ కార్డు, ఇంటిపట్టా ఇవ్వాలని అన్నారు. నీటి సరఫరాకి సంబంధించి మొత్తం 573 కాలనీలకు గాను 120 కాలనీలలో ఐదు లక్షలకు లోపల ఉండటం వల్ల నామినేషన్‌ పద్ధతిలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని సంబంధిత అధికారులు వివరించారు. పంచాయతీరాజ్‌ శాఖ వారు అప్రోచ్‌ రోడ్ల నిర్మాణం లేఅవుట్లలో వెంటనే పూర్తి చేయాలని అదేవిధంగా ఆర్చిల నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. హౌసింగ్‌ పీడీ పద్మనాభం మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ షన్మోహన్‌ ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో గృహ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటివరకు 38వేల గృహనిర్మాణాలు పూర్తి చేసుకోగలిగామని మరో రెండు వేల గహనిర్మాణాలు పక్షం లోపల పూర్తి చేసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారితో పాటు పిడి పద్మనాభం, డ్వామా ఏపిడి వాణి, ఈఈపిఆర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, గృహ నిర్మాణశాఖ అధికారులు, ఎంపీడీవోలు, ఇతర హౌసింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.