విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజి మేయర్ కఠారి హేమలత
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్
తమ అత్తమామల జంట హత్య కేసులో కొందరు వైకాపా నాయకులు సాక్ష్యులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని మాజి మేయర్ కఠారి హేమలత అన్నారు. గురువారం స్థానిక గంగనపల్లిలోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ కుటుంబానికి జరిగిన అన్యాయం అందరికీ తెలిసిందేనని, ఈ కేసులో కొందరు స్థానిక నేతలు సాక్ష్యులను ప్రలోభ పెట్టడం, బెదిరించడం వంటి చర్యలకు పూనుకుంటున్నట్లు చెప్పారు. ఎవ్వరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సాక్షులు గట్టిగా ఉన్నట్లు చెప్పారు. బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగే ప్రసక్తిలేదన్నారు. పోలీసు తమకు సహకరిస్తున్నట్లు చెప్పారు. నిందితులకు చట్టపరంగా శిక్ష పడేలా తుదివరకు ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు.










