Oct 28,2023 23:56

ప్రజలతో మాట్లాడుతున్న స్పీకర్‌ సీతారాం

ప్రజాశక్తి- బూర్జ: నాగవలి నది ఓపెన్‌ హెడ్‌ ఛానల్‌ ద్వారా సాగునీరు ఇప్పించాలని ఉవ్వపేట వావాం రైతులు స్పీకర్‌ తమ్మినేని సీతారాంను కోరారు. చేతికి వచ్చిన పంట వర్షాలు లేకపోవడం వల్ల రైతుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఓపెన్‌ హెడ్‌ ఛానల్‌ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. అలాగే ఉవ్వ పేట, వావాం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గడపకు తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి కర్నెన నాగేశ్వరరావు, జెడ్‌పిటిసి బెజ్జిపురపు రామారావు, మండల పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర టిట్కో డైరెక్టర్‌ కండాపు గోవిందరావు, వైస్‌ ఎంపిపిలు బుడుమూరు సూర్యారావు, కరణం కృష్ణమనాయుడు, మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షులు గుమ్మడి రాంబాబు, డిసిసిబి డైరెక్టర్‌ జల్లు బలరాం నాయుడు, సర్పంచ్‌ గొలివి మంజుల, మాజీ సర్పంచ్‌ బట్నా వెంకటనాయుడు, గోలివి గోపాలరావు, చింత విశ్వనాధం, వడ్డాది రమణ, సురపు అప్పన్న పాల్గొన్నారు.