Oct 28,2023 00:51

కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న టిడిపి నాయకులు

పల్నాడు జిల్లా: రైతులు సాగు చేసిన పంటలు ఎండు దశకు చేరుకున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో సాగునీరు ఇవ్వకపోతే పెట్టిన పెట్టుబడి అంతా వృథా అవుతుందని టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జివి ఆంజ నేయులు అన్నారు. స్థానిక టిడిపి జిల్లా కార్యా లయంలో శుక్రవారం జిల్లా నియోజకవర్గ ఇన్‌ఛార్జిల విస్తృత స్థాయి సమావేశం జరి గింది. ఈ సమావేశానికి టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జివి ఆంజనేయులు అధ్యక్షత వహించారు. సమావేశంలో ప్రస్తుతం సాగు నీరు, తాగు నీరు లేక రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనం తరం రైతు నాయకులతో కలిసి కలెక్టర్‌ కార్యా లయం వద్దకు వెళ్లి ప్లే కార్డులు చేతబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 4 రోజులలో సాగునీరు విడుదల చేసి ఎండు తున్న పంటలను రైతాంగాన్ని కాపాడకపోతే రైతు లను, రైతు నాయకులను ఏకం చేసి కలె క్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సాగు, తాగునీరు వెంటనే విడుదల చేయాలని , పంట నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని నినాదాలు చేశారు. రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని రైతులను ఆదుకోలేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరి పాలిస్తున్నాడని విమర్శించారు. కళ్ళ ముందు పంట ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించు కోవడం లేదన్నారు. జిల్లా లో ఉన్న మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని కష్టాల్లో ఉన్న రైతుల గురించి స్పందించలేదన్నారు. సత్తెనపల్లి టిడిపి ఇన్‌ఛార్జి కన్నా లక్ష్మీనారా యణ మాట్లాడుతూ కనీసం ఆరుదలకి అయినా నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలనే సహ కూడా వైసీపీ నేతలకు లేకుండా పోయిం దని ఆవేదన వ్యక్తం చేశారు. నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి డాక్టర్‌ చదల వాడ అరవిందబాబు మాట్లాడుతూ ఆర్‌.బి.కే లో రైతులకు ఉపయోగపడే ఏ ఒక్క పని ముట్లు కూడా ఇవ్వడం లేదని, కనీసం ఎరు వులు విత్తనాలు కూడా అందుబాటులో ఉంచ లేకపోయారన్నారు. పంట దెబ్బతిన్న రైతులను కలెక్టర్‌ స్పందించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధులు గొట్టి పాటి జనార్ధన్‌ బాబు, పెమ్మసాని నాగేశ్వర రావు, కార్యనిర్వా హక కార్యదర్శులు ముండ్రు సుబ్బారావు, కన్నె దార వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
వాటర్‌ గ్రిడ్‌ పనులు పూర్తి చేయండి
వినుకొండ: పల్నాడు ప్రాంతంలో నెలకొన్న తీవ్ర తాగునీటి ఎద్దడి నివారణకు నాడు టిడిపి ప్రభ ుత్వం రూ.600 కోట్లతో ప్రవేశపెట్టిన వాటర్‌ గ్రిడ్‌ పథకాన్ని పూర్తి చేసి ఇంటింటికి నీటి కొళాయి ఇచ్చి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. బొల్లాపల్లి మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను తెలుసుకునేందుకు గురువారం గ్రామాలను ఆయన సందర్శించి ప్రజలను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ గురజాల,మాచర్ల,వినుకొండ ప్రాంతాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరిం చేందుకు నాడు టిడిపి ప్రభుత్వం వాటర్‌ గ్రేడ్‌ ద్వారా ఇంటింటికి త్రాగునీటి కులాయి ఏర్పా టుకు రూ.600 కోట్లు నిధులు కేటాయిస్తే, నాలుగేళ్ల వైసిపి పాలనలో కనీసం 5 శాతం కూడా పనులు పూర్తి చేయలేదని విమ ర్శించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో వరికపూడిశెల ప్రాజెక్టుక్‌ మళ్లీ శంకుస్థాపన అంటూ ప్రజలను మోసం చేయడం దుర్మార్గ మన్నారు. భూగర్భ జలాలు అడుగంటి తీవ్రంగా తాగునీటి ఎద్దడితో అల్లాడిపోతున్న గ్రామాలకు వెంటనే ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు.