May 07,2023 21:04

ప్రజాశక్తి - మొగల్తూరు
మండలంలోని పేరుపాలెం బీచ్‌ వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు ప్రత్యేక, ద్విచక్ర వాహనాల్లో బీచ్‌కు ఉదయమే చేరుకున్నారు. పలువురు సముద్ర కెరటాల్లో స్నానాలు చేశారు. చిన్నారులు ఇసుక తేన్నెలపై, ఒడ్డు కొట్టుకొస్తున్న కెరటాలతో ఆటలాడుకున్నారు. ఒడ్డున ఉన్న ఆలయాలను దర్శించుకుని సరివే కొబ్బరి తోటల్లో సహపక్తి భోజనాలు చేశారు.