Mar 12,2023 21:03

ప్రజాశక్తి - మొగల్తూరు
మండలంలోని పేరుపాలెం బీచ్‌ వద్ద ఆదివారం పర్యాటకల సందడి నెలకొంది. పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు ప్రత్యేక, ద్విచక్ర వాహనాల్లో ఉదయమే బీచ్‌కు చేరుకున్నారు. పలువురు సముద్ర కెరటాల్లో స్నానాలు చేశారు. చిన్నారులు ఒడ్డుకు కొట్టుకొస్తున్న కెరటాలతో, ఇసుక తేన్నెలపై ఆటలాడుకున్నారు. అనంతరం ఒడ్డున ఉన్న ఆలయాలను దర్శించుకుని సర్వే తోటలో సహపంక్తి భోజనాలు చేశారు.