ప్రజాశక్తి-పెనుకొండ : రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణి చేయడంలో ప్రభుత్వం వైపల్యం చెందిందని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం నాయకులు పేర్కొన్నారు. బుధవారం పెనుకొండలోని వ్యవసాయ గోదాము నందు వేరుశెనగ విత్తనాలను ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ఆధ్వర్యంలో నాయకులు పరిశీలించారు. ఈ సందర్బంగా రైతుసంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలను పంపిణి చేయడంలో ప్రభుత్వం వైపల్యం చెందింది అని, నాసిరకం విత్తనాలు వేయడంవలన పంటదిగుబడి తగ్గి రైతు నష్టపోతాడు అని చెప్పారు. జిల్లా ఉపాధ్యక్షలు హరి మాట్లాడుతూ రైతుల నుంచి సేకరించిన విత్తనాలను శుద్ధి చేయకుండా యాదవిధిగా పంపిణి చేయడం వలన బస్టాలలో చెత్తచెదారం పెరుకు పోయిందని, వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోని నాణ్యమైన విత్తనాలను సకాలంలో పంపిణి చేయాలనీ ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్, వ్య కా సం జిల్లా కమిటి సభ్యులు గంగాధర్, తిప్పన్న, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.










