Jul 08,2022 16:25

ప్రజాశక్తి-వి కోట : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  మాజీ ముఖ్యమంత్రి  స్వర్గీయ డా.వై.యస్.రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని రైతు దినోత్సవం  వెడుకలను వి.కోటలో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక వైఎస్సార్ కూడలిలో రాష్ట్ర వైఎస్సార్ పార్టీ ప్రధాన కార్యదర్శి పిఎన్ నాగరాజు ఆధ్వర్యంలో  దివంగత మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. వారి పాలనలో చేపట్టిన ప్రజాసంక్షేమ పథకాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. వారి బాటలోనే తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల వద్ద మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూజలు నిర్వహించి ఘనంగా నివాళులు ఆర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తమీంఖాన్  వికోట ఉపసర్పంచ్ అక్మల్ ఎంపీటీసీ చలపతి  నేతలు అమర్నాథ్ నరేంద్ర మోహన్రాజ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు