Jul 12,2023 15:40

ప్రజాశక్తి-బొమ్మనహల్ : బొమ్మనహల్ మండలంలోని బొమ్మనహల్ గ్రామములో నిరుపేదలైన వారికి సర్వేనెంబర్ 85బి ఇంటి పట్టాలు 200 మంజూరు చేసినట్లు తాసిల్దార్ శ్రీనివాసులు తెలిపారు. ఈ కాలనీకి వెళ్లడానికి కొంతమంది రైతులు పొలాల నుండి కాలిజాడ ఉన్నది. గృహాలు నిర్మించుకోవడానికి మెటీరియల్ తీసుకొని వెళ్లడానికి దారి లేకపోవడంతో ఇంతవరకు జగనన్న కాలనీలో ఎలాంటి పనులు చేపట్టలేదని ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలకు మధ్యగల ఖాళీజాడను బండి జాడగా మార్చాలంటే రైతుల నుండి మాట్లాడి వారితో ఎలాంటి ఒప్పందమైన చేసుకొని దారిస్తే తప్ప గృహాలు నిర్మించుకోవడం చాలా కష్టమైన పనిని వినియోగదారులు అంటున్నారు. గతంలో ఈ భూమి సీలింగ్ ల్యాండ్ అయినందున పొలాల మధ్య ఉన్న ఈ స్థలాకు దారి లేకపోవడం ఇప్పుడు కష్టంగా మారిందని జగనన్న కాలనీకి వెళ్లడానికి దారి చూపించవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవదూపి దారి చూపించగలిగితే త్వరలో గృహాలు పూర్తి చేసుకుంటామని వినియోగదారులు అంటున్నారు. అంతేకాకుండా గృహాలు ఇచ్చిన ప్లాట్లలో నీళ్లు లేవు మరియు విద్యుత్ లేదు మౌలిక సదుపాయాలు లేకపోయినా గృహాలు ఎలా నిర్మించుకోవాలని ఈ విషయమై అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో ఎంతోమంది నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇచ్చారు. దారి చూపలేదు బోర్ వేయలేదు విద్యుత్తు లైన్లో లాగా లేదు గృహాలు నిర్మాణం ఎలా జరుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుపేదల పట్ల ప్రేమతో ఇంటి పట్టాలు మంజూరు చేశారు. కానీ గృహాలు సంబంధించిన రా మెటీరియల్ ఇసుక కంకర సైజు రాళ్లు తీసుకొని వెళ్లాలంటే స్థానిక రైతులు అడ్డుకుంటున్నారని వారన్నారు.