Jun 09,2023 16:05
  • నోటీసులు ఇవ్వకుండా ఇల్లు తొలగించడం అన్యాయం : జనసేన టౌన్ అధ్యక్షులు చంద్రశేఖర్ 
  •  గరగపర్రు రోడ్డులో ఇళ్ల కోల్పోయిన బాధితుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం 

ప్రజాశక్తి-భీమవరం : భీమవరం పట్టణంలో గరగపర్రు రోడ్డు ప్రక్కన ఇల్లు కోల్పోయిన బాధితులకు  అండగా ఉంటామని అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు. బాధితులకు పూర్తి మద్దతు ప్రకటించి వారు చేస్తున్న ఆందోళనలో భాగస్వాములు అవుతామని హామీ ఇచ్చారు. స్థానిక  సీఐటీయూ కార్యాలయంలో పోరాట కమిటీ నాయకులు ఆధ్వర్యంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  జనసేన టౌన్ అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్  మాట్లాడుతూ 70 ఏళ్లుగా  నివాసం ఉన్న దళితులు ఇళ్లను ఏ నోటీసు ఇవ్వకుండా అన్యాయంగా తొలగించడం అన్యాయం అన్నారు.  ఈ ఘటనను జనసేన  తీవ్రంగా ఖండిస్తున్నాను. దళితులు అనేక  ఏళ్ల  నుచ్చి పైసా పైసా కూడబెట్టి ఇల్లు నిర్మాణం చేసుకుంటే దౌర్జన్యంగా వైసిపి ప్రభుత్వం మంది మదబలంతో ఉదయం ఐదు గంటలకు వచ్చి సామాన్లు కూడా తీసుకోకుండా వేయడం దారుణం వాపోయారు. టిడిపి నాయకులు ఐజాక్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం దళితులకు అండగా ఉంటామని చెప్పి దళితులు ఇళ్లను తొలగించడానికి దళితులు పట్ల ఏ విధమైన ప్రేమ ఉందో అర్థం అవుతుందని  విమర్శించారు. సిపిఐ ఏరియా కార్యదర్శి సిహెచ్ రంగ మాట్లాడుతూ  ప్రభుత్వం దళితులకు ప్రత్యామ్నాయ స్థలాలు చూపకుండా అన్యాయంగా తొలగించడాని ఖండించారు. బాధితులు చేస్తున్న  పోరాటానికి సిపిఐ మద్దతు ఉంటుందని  తెలిపారు.సిపిఎం పట్టణ కార్యదర్శి బి వాసుదేవరావు మాట్లాడుతూ గరగపర్రు రోడ్డు ప్రక్క నివాసం ఉన్న పేదలు అనేక వృత్తులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని చెప్పారు. వీళ్ళని తీసుకువెళ్లి టీట్టుకో గృహాల్లో పెట్టడం వల్ల  వారి జీవనోపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  60 మంది దళితులకు గత ప్రభుత్వం పట్టాలిచ్చి ఇల్లు నిర్మాణం చేశారని వాటిని దౌర్జన్యంగా  ప్రభుత్వం కూల్చివేసిందని విమర్శించారు. ఇల్లు కోల్పోయిన లబ్ధిదారులకు వెంటనే రెండు సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కోల్పోయిన లబ్ధిదారులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణం సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో అన్ని రాజకీయ పార్టీలు కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు డి.శ్రీనివాసరాజు మాట్లాడుతూ నష్టపోయిన దళితులకు ప్రభుత్వం ఆదుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇల్లు కోల్పోయిన లబ్ధిదారులు మార్తమ్మ మాట్లాడుతూ న్యాయం చేయాలని కలెక్టర్ కార్యాలయానికి వెళ్తే కలెక్టర్  ఇల్లు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు ఇచ్చారని అని ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశoలో  సిపిఎం నాయకులు త్రిమూర్తులు, ఆంజనేయులు, టిడిపి నాయకులు కే శ్రీనివాస్, ఇల్లు కోల్పోయిన లబ్ధిదారులు పాల్గొన్నారు.