Jun 29,2023 15:04

ప్రజాశక్తి-రొద్దం : ప్రామాదకరంగా మారిన కలవర్టు. మండలంలోని పెనుకొండ పావగడ ప్రధాన రహదారిలో ఆర్.కొట్టాల గ్రామ సమీపంలో ఉన్న కలవర్టు రోడ్డు మధ్యలో చిలికలు ఏర్పడడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. ఘత 5సంవత్సరాలు క్రితం పెనుకొండ నుంచి కర్ణాటక బార్డ్ వరకు దాదాపు 33కోట్ల వ్యయంతో ఈ ప్రధాన రహదారి రెండు వరసాల రోడ్డు వేసే క్రమంలో ఈ కలవర్టు ఏర్పాటు చేశారు. అయితే అది కాలక్రమేణా రోజురోజుకు రోడ్డు మధ్యలో చీలికగా ఏర్పడినది. అయితే అక్కడే మలుపు ఉండడంతో ద్విచక్ర వాహనాలు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నట్లు పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.