Sep 26,2022 15:39

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : కామినేపల్లి గ్రామం నలుమూలల నుండి వచ్చే దారులకు రాతిబండలతోని అడ్డగింపు చేసిన వైనం నెలకొంది. వివరాలు సదరు గ్రామం నుండి తరతరాలుగా పశువులు గొర్రెలు మేతకు వెళ్లే రాజపాటకు మరియు వంక పరంబోకు ఆక్రమించుకొని ఇంటి నిర్మాణం చేస్తున్నారు గ్రామస్తులు దీన్ని అడ్డుకున్న నేపథ్యంలో నాగప్ప శ్రీనివాసులు ఆక్రమించి గ్రామం పరిధిలోకి వచ్చే దారులలో జెసిపి సహాయంతో బండరాల్లో అడ్డంగా తోలి ప్రజలకు రాకపోకలకు ఆటంకం కల్పించారు. ఈ విషయమై తాసిల్దార్ కుమారస్వామికి గ్రామస్తులు వెళ్లి వినతి పత్రం సమర్పించగా వెంటనే స్పందించి గ్రామ రెవెన్యూ అధికారి గురువు రెడ్డి స్థానిక ఎస్సై వెంకట నరసింహులు సంఘటన స్థలానికి పంపించి దారులకు అడ్డుగా వేసిన కంచెను తీయించి ప్రజలకు దారి కల్పించారు ప్రస్తుతం దౌర్జనంగా నాగప్ప అనిత శ్రీనివాసులు నిర్మిస్తున్న ఇంటి నిర్మాణాన్ని ఆపేశారు. సర్వే చేయించి గ్రామంలో  ప్రజల మధ్య ఘర్షణ లేకుండా చూస్తామని తాసిల్దార్ హామీ ఇవ్వడంతో  కామినేపల్లి గ్రామ ప్రజలు శాంతించారు.