- మెరుగైన చికిత్స కోసం ఒకరు తిరుపతి, మరొకరు బెంగళూరుకు తరలింపు
ప్రజాశక్తి-ఉరవకొండ : రోడ్డు ప్రమాదంలో కంపార్ట్మెంట్ లో పదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు గాయాలైన సంఘటన విడపనకల్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు పదవ తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కావడంతో మండల పరిధిలోని హావలిగి గ్రామానికి చెందిన కే.వంశీ, జి.మల్లికార్జున విద్యార్థులు కంపార్ట్మెంట్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎగ్జామ్స్ సెంటర్ ను చూసి రావడానికి స్వగ్రామం నుంచి ద్విచక్ర వాహనంలో బయలుదేరారు.విడపనకల్లు మీదుగా మోడల్ స్కూల్ కి వెళుతుండగా కార్ ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో కే.వంశీ(17) అనే విద్యార్థికి తలకు కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. జి.మల్లికార్జున(18) అనే విద్యార్థికి నడాలకు, పాదాలకు తీవ్ర గాయాలు కావడంతో ప్రథమ చికిత్స అనంతరం అనంతపురంకు తరలించారు. ఈ సంఘటన తెలుసుకున్న విడపనకల్లు మండలం జేసిఎస్ మండల కన్వీనర్ భరత్ రెడ్డి, హవలిగి సర్పంచ్ రఘురాములు, ఎంపీటీసీ రాజశేఖర్, మండల విద్యాశాఖ అధికారి ప్రభావతమ్మ అనంతపురంలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ధైర్యపరచి, పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం వంశీ అనే విద్యార్థిని బెంగళూరుకు, మల్లికార్జున అనే విద్యార్థిని తిరుపతికి తరలించారు. విద్యార్థుల కుటుంబ సభ్యులను ధైర్యపరిచి పరామర్శించారు.










