ప్రజాశక్తి-రొద్దం : మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఒకరికి తలకు తీవ్ర గాయాలు. మండలంలోని పెనుకొండ పావగడ ప్రధాన రహదారిలో రొద్దం, మరువపల్లి మధ్యలో మసీదు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమందేపల్లి మండలం రంగేపల్లి గ్రామానికి చెందిన కదిరిప్ప పావగడ వైపు నుంచీ తన సొంత గ్రామానికి వెళ్తున్న అతను రోడ్డు ప్రమాదానికి గురైనాడు. దీంతో రోడ్డుపై వెళ్లే వారు ట్రాక్టర్ ద్వారా రొద్దం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తలకు గాయాలు కావడంతో తలకు డాక్టర్ జగదీష్ బాబు తలకు కుట్లు కుట్లు వేశారు. విషయం తెలుసుకొన్న ఎస్ ఐ నాగస్వామి ఆసుపత్రికి చేరుకొని దగ్గరుండి చర్యలు చేపట్టారు.










