ప్రజాశక్తి-కార్వేటినగరం(చిత్తూరుజిల్లా): ఘాట్ రోడ్ లో అదుపు తప్పిన కారు కొండ రాళ్లను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలు అయ్యారు. కార్వేటి నగరం ఘాట్ రోడ్డులోని డంపింగ్ యార్డ్ సమీపంలో ఈ ఘటన సంభవించింది. తిరుపతి నుండి కార్వేటి నగర్ కు వస్తుండగా కారు అదుపు చేయలేక కొండ రాళ్లను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. మృతుడు తిరుపతి రూరల్ మండలం, ముత్యాలరెడ్డిపల్లికి చెందిన మురళి కృష్ణా రెడ్డి కుమారుడు కె.భానుచంద్ (21)గా పోలీసులు గుర్తించారు. వైకుంఠపురంకు చెందిన సురేందర్ రెడ్డి కుమారుడు డి.హర్షకు తీవ్ర గాయాలు కావడంతో 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన కార్వేటినగరం ఎస్సై దస్తగిరి దర్యాప్తు చేస్తున్నారు.










