ప్రజాశక్తి-గుత్తి : మండలంలోని వన్నెదొడ్డి గ్రామ మలుపు వద్ద 44వ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాదులోని కాచిగూడ కు చెందిన సురేష్, ప్రదీప్, వెంకటరామిరెడ్డి, వసంత్ లు కారులో అనంతపురంలోని ఓ వివాహానికి వెళ్లారు. వివాహ అనంతరం స్వగ్రామానికి బయలుదేరారు. జాతీయ రహదారిపై వెళ్తుండగా వారి కారు లారీ ఢీకొంది. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్య కోసం గాయపడ్డ వారిని అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు.










