Jun 21,2023 11:52

ప్రజాశక్తి-చౌడేపల్లి : మండలం చౌడేపల్లి సోమల మార్గమధ్యంలో బసింగిరిగుంట వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును మినీ లారీ ఢీకొనటంతో 20 మంది గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి పోలీసులు, వైద్య సిబ్బంది చేరుకున్నారు. గాయపడిన వారిని చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు.