Dec 25,2022 15:51
  • హోటల్లోకి దూసుకెళ్లిన బొలేరో

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : కుప్పం - పలమనేరు జాతీయ రహదారిలోని బైరెడ్డిపల్లి గ్రామంలోని రాయల్ మహల్ వద్ద కుప్పం నుండి మదనపల్లికి వెళ్తున్న బొలేరో, పన్నుసముద్రం నుండి బోరుగూరుకి రాబోయే నూతన సంవత్సరానికి కొత్త దుస్తులు కొనేందుకు సుమోలో డ్రైవర్ వినాయక. జ్యోతి, పుష్ప, మునెమ్మ, సతీష్, మురళి, సత్య, రూప, మాణిక్యం ,విత్తి రాజు, వెళ్తున్న తరుణంలో ప్రమాదవశాత్తు రెండు బండ్లు ఢీ కొన్నాయి. బొలోరా వాహనం అతివేగంగా రావటంతో సుమోను ఢీకొనడంతో సుమా బోల్తా పడింది. బులోరావ్ వాహనం కంట్రోల్ చేయక అదుపుతప్పి పక్కనున్న శ్రీనివాస హోటల్లోకి సేటర్ను ఢీకొని లోనికి వెళ్ళింది. ఈ ప్రమాదంలో వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు స్వప్న గాయాలతో బయటపడ్డారు. వారిని స్థానికుల సహాయంతో చికిత్స కోసం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.