ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : కైగల్ బ్రిడ్జి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఎర్టిగా టాటా ఏసీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురికి బలమైన గాయాలు అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్టిగా కారు విరపాచిపురం గ్రామం నుండి కేఆర్ పురంకు వెళ్తుండగా కైగల్ బ్రిడ్జి వద్ద అత్యధిక మంచు కారణంగా ఎదురుగా వస్తున్న టాటా ఏసీ ట్రక్కును ఢీకొన్నది. సంగీత సింగ్ (60) అనే మహిళా అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ హరుసన్ సింగ్ (28), రత్న యాదవ్ (26), ఇలియాస్ ఖాన్(85) స్వల్ప గాయాలతో బయటపడ్డారు. టాటా ఏసీలో ప్రయాణిస్తున్న దేవదొడ్డి గ్రామానికి చెందిన గోవింద రాజులు (56) టాటా ఏసి డ్రైవర్ పరాయిలో ఉన్నాడు. స్థానికులు సమాచారం అందడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని బైరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషాదంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్ సహాయంతో కుప్పం పీఏసీ తరలించినట్లు తెలియపరిచారు. ఏఎస్ఐ కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం సంగీత సింగ్ మృతదేహాన్ని పలమనేరు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం అందించారు.










