ప్రజాశక్తి -కాళ్ల : ప్రజలకు సురక్షిత మంచినీరు ఉచితంగా అందించేందుకు గ్రామ సర్పంచ్ మంతెన శ్రీనివాసరాజు ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మించడం అభినందనీయమని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. ఎస్సీ బోస్ మాజీ సైనిక్ కాలనీ గ్రామంలో గ్రామ సర్పంచ్ మంతెన శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంటును ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు బుధవారం ప్రారంభించారు. మాజీ సర్పంచ్ మంతెన సత్యనారాయణరాజు చిట్టెమ్మ జ్ఞాపకార్థంగా వారి కుమారుడు శ్రీనివాసరాజు, మనవడు ఎం ఎస్ వి వి రాజు, మనవరాలు కనకదుర్గల ఆర్థిక సహకారంతో వాటర్ ప్లాంట్ ను నిర్మించారు.










