- భీమవరంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన
ప్రజాశక్తి -భీమవరం : రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గాతల జేమ్స్, సాగి రాజు సత్యనారాయణ రాజు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం పిలుపులో భాగంగా భీమవరoలో సంఘం కార్యాలయం వద్ద రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సమస్యల సాధన కోసం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రతీనెలా ఒకటవ తేదీన పెన్షన్లను పెన్షనర్లకు వారి అకౌంట్లకు జమ చేయించాలని పేర్కొన్నారు. పెండింగ్ బిలులను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫె ఫిక్సేషన్ స్టేజ్ మెంట్లు యివ్వాలని, అదనపు పెన్షన్ ఇంతకు ముందు చెల్లించిన క్వాంటం ఆఫ్ ప్రకారం చెల్లించాలని పేర్కొన్నారు. కరువు భత్యం బకాయిలు, పిఆర్సి అరియర్లు వెంటనే చెల్లించాలనారు. ఈ హెచ్ ఎస్ కార్డు ద్వారా అన్ని వ్యాధులకు, అన్ని ఆసుపత్రులలో వైద్యం జరిగేటట్లు చూడాలన్నారు. మెడికల్ రీఎంబర్స్ మెంట్ కొన సాగించాలనీ డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా ఖజానా లెక్కల అధికారి ఏ గణేష్ కు సమస్యలతో కూడిన వినత పత్రానీ అందజేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం యూనిటీ అధ్యక్షులు ఎన్ ఎస్ ఎస్ పాల్, కోశాధికారి పి వి ఆర్ ఎస్ ఎస్ సూర్యనారాయణ, భాస్కరరావు, ఉపాధ్యక్షులు అప్పన సత్యనారాయణ, కె.చంద్రరావు, ఆర్ సూర్యనారాయణ, కాలేజ్ టీచర్స్ అసోషియేషన్ రాష్ట్ర కోశాధికారి సాగి అప్పలరాజు, డా. జి.వి. సత్యనారాయణ, రాజు పాల్గొన్నారు.










