Jun 28,2023 13:27

ప్రజాశక్తి-బొమ్మనహాళ్ : మండలంలోని  బొమ్మనహళ్ సచివాలయం నందు రీ సర్వే కార్యక్రమంపై రైతులతో తాసిల్దార్ సమీక్ష సమావేశం నిర్వహించి ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బొమ్మనహల్ రెవిన్యూ పరిధిలో గల రైతులు రీసర్వే కార్యక్రమానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వారు తుంగభద్ర ఆయకట్టు భూములు మరియు దేవదాయ శాఖ భూములు అసైన్మెంట్ భూములు వారికి సంబంధించిన హద్దులను గుర్తించడానికి వచ్చిన అధికారులతో సహకరించి మీ భూములు హద్దులు మీరు గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. బ్రిటిష్ పరిపాలనలో నిర్వహించిన సర్వే మరియు ప్రస్తుతం నిర్వహిస్తున్న సర్వే కొన్ని మార్పులు చేర్పులు జరిగి ఉండవచ్చని అందుకు రైతులందరూ సహకరిస్తే సర్వే సుమాయసంగా ముందుకు వెళుతుందని వారన్నారు భూములు ఉండి కౌలుకిచ్చే రైతులు తప్పనిసరిగా వారికి  కౌలు కార్లు మంజూర అయ్యేలా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు సర్వే స్పెషల్ ఆఫీసర్ సుజాత సర్వేర్ రవితేజ, విఆర్ఓ తిమ్మప్ప, రైతులు మోహన్ బాబు ఫోటో స్టూడియో బసవరాజ్ పయ్యావుల  సత్యనారాయణ, అనిల్ కుమార్, గొల్ల సూరి సచివాలయం సిబ్బంది రైతులు పాల్గొన్నారు.