- వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు
ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : మండలంలోని రహదారి పాతపేట నుండి కుప్పనపల్లికి పోవు రహదారి నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ఇరుకుగా ఉన్న రోడ్డును వెడల్పు చేయాలంటే ఇరువైపులా ఉన్న చింత చెట్లను తొలగించాలని గ్రామస్తులంతా కలసి బుధవారం స్థానిక తహసిల్దార్ కుమార స్వామికి వినతిపత్రం అందజేశారు త్వరలో మీ సమస్యను పూర్తి చేస్తామని తాసిల్దార్ ఆమీ ఇవ్వడం జరిగింది. మమతా రవిచంద్రన్ సర్పంచ్ గ్రామ పెద్దలు ఎంపీటీసీ ఎన్ సురేష్ . డి రాజేంద్ర, వై సర్పంచ్ దినకర్ గౌడ్ రాజశేఖర్ రెడ్డి, జి రమణప్ప, జి రవిచంద్ర., డి గోపాల్ రెడ్డి మరియు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.










