Apr 10,2023 16:24

ప్రజాశక్తి-బొమ్మనహాళ్ : మండలంలోని డి పొన్నూరు గ్రామములో బీసీ కాలనీ నందు 33 కెవి విద్యుత్ లైన్ ను దర్గా పొన్నూరు నుండి గోవింద్ వాడకు లైన్ వెళ్ళింది. ఈ లైన్ ను అధికారులు కాంట్రాక్టర్లు గృహాల మీద కాకుండా గ్రామ చివరన తీసుకుపోవాలని గ్రామస్తులు పలమార్లు విజ్ఞప్తి చేశారు. అధికారులు దౌర్జన్యంగా విద్యుత్ లైన్ లాగారని దర్గా ఉన్నూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోరి నాగరాజు సోమవారం విద్యు సబ్ ఇంజనీర్ కు రాతపూర్వకమైన ఫిర్యాదు చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ప్రజల ప్రాణాలతో విద్యుత్ అధికారులు చెలగాటమాడుతున్నారని గతములో 33 కెవి వైర్ తెగి కూలీలపై పడి మృతి చెందిన సంగతి పాఠకులకు తెలిసిందే. అది మరవకమునుపే మరొక విద్యుత్ ప్రమాదం జరగడానికి సిద్ధంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే విద్యుత్ వైర్లు తొలగించాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.