Sep 23,2023 16:52
  • నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్.పి. జిఆర్. రాధిక.

ప్రజాశక్తి-శ్రీకాకుళం : కేసులు దర్యాప్తు ఖచ్చితత్వంగా చేసి కేసులు విచారణ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ లతో సమన్వయంతో పని చేయాలని శిక్షలు శాతం పేరిగేందుకు కృషి చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోలీసు అధికారులకు జిల్లా ఎస్.పి. జి.ఆర్.రాధిక సూచించారు. రోడ్డు భద్రత నియమాలను ఉల్లంఘించి ప్రమాదాలకు కారకులైన వారి లైసెన్స్ రద్దు వంటి చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో సెప్టెంబర్ నెలలో 29 తీవ్రమైన ప్రమాదాల కేసుల్లో 22 మంది వాహన చోదకులు లైసెన్స్ రద్దు చేయడం జరిగింది అని ఆమె తెలిపారు. శనివారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో ఆగస్టు నెలకు సంబంధించిన కేసులపై పబ్లిక్ ప్రాసిక్యూటర్,పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి. మాట్లాడుతూ ముఖ్యమైన కేసులు దర్యాప్తులో సాక్షులు విచారణ, ఆధారాలు సేకరణ, ప్రాపర్టీ స్వాధీనంలో  జాగ్రత్తలు పాటిస్తు,కోర్టులో కేసులు విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సలహాలు సూచనలు పాటించి నిర్ణిత సమయంలో సాక్షులు హాజరు పరిచాలన్నారు. ప్రాధన్యత క్రమంలో జిల్లాలోని గుర్తించిన   ప్రాధన్యత కేసులపై దృష్టి సారించాలన్నారు.రౌడీ షీటర్స్ ముద్దాయిలుగా ఉన్న కేసులు త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. నాన్ బెయిల్ బుల్ వారంట్లు ముద్దాయలను కోర్టులో హాజరుపరిచాలన్నారు. జాతీయం రహదారిపై గల ధాబాలు, షాప్స్, టైర్ పంచిరింగ్ దుకాణాలు వద్ద తప్పకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఎస్పీ సూచించారు.రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రమాదకరమైన ప్రదేశాలు గుర్తించి నిత్యం వాహనాల తనిఖీ చేసి, స్పీడ్ బ్రేకేర్స్, విజిబుల్ రంగులు వేసి ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఏ స్టేషన్ పరిధిలోని ప్రమాదాలు ఎక్కువగా జరిగినట్లు అయితే ఆయా పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహన చోదకులు విధిగా రోడ్డు భద్రత నియమాలు పాటించి జిల్లాలో ప్రమాదాల నివారణకు భాగస్వాములు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు.గ్రేవ్ కేసులైన ఎస్.సి.,ఎస్.టి, పోక్సో కేసుల్లో దర్యాప్తు వేగవతం చేయాలిని జిల్లా ఎస్పీ పోలీసు అధికారులు ను ఆదేశించారు.మిస్సింగ్ కేసులను త్వరితగతిన ఛేదించాలని, దర్యాప్తులో ఉన్న కేసులు వేగంగా పూర్తి చేయాలని పలు అంశాలపై అధికారులకు దిశ నిర్దేశించారు. ఇందులో భాగంగా బీట్ బుక్ నిర్వహణ సక్రమంగా అమలు చేయాలని బీట్ రికార్డుల క్షుణ్ణంగా పరిశీలించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, మహిళా పోలీసులకు ప్రశంసా పత్రాలు శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలోని లోక్ అదాలత్ కేసులు పరిష్కారం చేయడంలో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ వై.శృతి,రోడ్డు ప్రమాదాలు నివారించడం లో కాశీబుగ్గ,టెక్కలి సబ్ డివిజిన్ డిఎస్పీలు నాగేశ్వరరెడ్డి, బాలచంద్ర రెడ్డి, అదేవిధంగా దర్యాప్తు కేసులు,లోక్ అదాలత్ కేసులు పరిష్కారం,రోడ్డు ప్రమాదాలు నివారించడంలో ప్రతిభ కనబరిచిన సీఐ పి.పైడియ్య, ఎస్ఐలు బాలరాజు(కంచిలి), మధుసూదన్(వజ్రపు కొత్తరు), కృష్ణ వర్మ(నౌపడ), విజయకుమార్ (శ్రీకాకుళం రూరల్), రాజేష్(జె.ఆర్.పురం), లక్మణరావు(పొందూరు),కృష్ణ(ఆమదాలవలస),మహిళా పోలీసులు రేవతి,సూర్య కుమారి,మర్య ఖాతున్ అను పై వారందరికీ జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేసి ప్రేత్యేకా అభినందనలు తెలియజేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు టిపి విఠలేశ్వర్, జె.తిప్పే స్వామి,డిఎస్పీలు  యస్.బి, డిఎస్పీ ఎస్.బాలరాజు,టౌన్ డిఎస్పీ వై శ్రుతీ, టెక్కలి డీఎస్పీ డి.బాల చంద్ర రెడ్డి, కాశీబుగ్గ డిఎస్పీ నాగేశ్వర రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.మల్లేశ్వరరావు,ఆదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కె.తిరుమలరావు,కె. శంకర్ రావు, శ్రీకాంత్,సీనియర్ ఏపిపిలు నాగభూషణం, సుశీల, జిల్లా వ్యాప్తంగా ఉన్న సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.