May 29,2023 16:02
  • 8 మంది అరెస్ట్ డిఎస్పి సుధాకర్ రెడ్డి

ప్రజాశక్తి - బంగారు పాల్యం : ఎర్రచందనం దుంగలు రెండు కార్లను స్వాధీనం చేసుకుని ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ సుధాకర్ రెడ్డి అన్నారు సోమవారం పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బెంగళూరుకి ఆక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్నట్టు సమాచార రావడంతో సోమవారం ఉదయం మహాసముద్రం టోల్ ప్లాజా వద్ద సిఐ నరసింహారెడ్డి సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు కార్లలో 16 ఏరా చందనం దొంగలను దొంగలు అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీటి విలువ 30 లక్షల రూపాయలు వాహనం విలువ 10 లక్షల రూపాయలు నిందితులు కోలార్ జిల్లా కే జి ఎఫ్ తాలూకా చెందిన హాసన్ కుమారుడు అబ్దుల్ రహిమాన్ తిరువన్నమలై జిల్లా జమున మత్తూర్ తాలూకా కుట్టత్తూరు గ్రామానికి చెందిన కోదండ పాణి కుమారులు మహేంద్ర తిరుపతూర్ జిల్లా తగల కుప్పం గ్రామానికి చెందిన పాండియన్ కుమారుడు మహదేవన్ వానింపాటి తాలూకా మిట్టూరు గ్రామం చెందిన గోవిందరాజులు కుమారుడు శివన్ అదే గ్రామానికి చెందిన రంగనాథన్ కుమార్ చిన్న తంబి తిరుపతూర్ తాలూకా కరకు పాలకు చెందిన రామస్వామి కుమారుడు కాలేయప్పన్ మురుగేష్ కుమారుడు శివశంకర్ కాలి కుమారుడు రవి 8 మందిపై అక్రమ ఎర్రచందనం కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్టు డిఎస్పి సుధాకర్ తెలిపారు. ఇమ్రాన్ షరీఫ్ పరారీలో ఉన్నట్టు ఈ దాడుల్లో సీఐ నరసింహారెడ్డి ఏఎస్ఐ మల్లప్ప హెడ్ కానిస్టేబుల్  గజేంద్ర పోలీసులు అస్గర్ ముబారక్ మోహన్ రమణ తదితరులు పాల్గొన్నారు.