May 18,2023 10:54
  • హైవేపై వెళ్లడానికె మొగ్గుచూపుతున్న సిబ్బంది
  • ఆత్మకూరులోకి రామంటున్నారని ప్రయాణీకుల అవస్థలు

ప్రజాశక్తి-ఆత్మకూరు : రాయదుర్గం అనంతపురం మధ్య నడిచే ఆర్టీసి రాయదుర్గం డిపో బస్సులు సిబ్బంది ఎప్పుడు పడితే అప్పుడు ప్రయాణీకులను ఇబ్బందికి  గురిచేస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఈరూట్ మీద నడిచే బస్సులు ఆత్మకూరు మండల కేంద్రానికి చేరుకునే ప్రయాణీకులకు వేళాపాలా లేకుండా నరకం చూపుతున్నారు. ఇది రాయదుర్గం బస్సు ఆత్మకూరులోకి వెళ్ళదు .బైపాస్ వెంట వెళుతుందని ప్రయాణీకులను బస్సు ఎక్కకుండా చేయడమో లేక ఎక్కిన వారినీ దింపేసి వెళ్లడమో చేస్తున్నారు. డిపో మేనేజర్లు చొరవ తీసుకుని ఏబస్సు ఆత్మకూరులోకి వస్తుంది. ఏబస్ బైపాస్ పై వెళుతుంది అన్నవిషయం ఆత్మకూరు బస్టాండ్ లో బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో కళ్యాణదుర్గం బస్టాండ్ లో ఆత్మకూరు వెళ్లే ప్రయాణీకులను బైపాస్ పై వెళుతామని బస్సులో ప్రయాణీకులను దింపి వెళ్లడంపై రాత్రివేళ అసహనం వ్యక్తం చేశారు. రాయదుర్గం డిపో బస్సులకోసమే ఆత్మకూరులో బైపాస్ నిర్మించారేమోనని ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఆర్టీసి అధికారులు దీనిపై ప్రజలకు స్పష్టత నివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.