ప్రజాశక్తి-అనంతపురం జిల్లాలోని కళాశాలల్లో ర్యాగింగ్ నిరోధక చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సీనియర్ సివిల్ జడ్జి దీన సూచించారు. గురువారం విజయనగర న్యాయ కళాశాలలో ర్యాగింగ్ నిరోధక చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలన్నారు. ర్యాగింగ్ కారణంగా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు. ఈ చట్టంపై విద్యార్థులు, అధ్యాపకులకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీలోని సీనియర్ న్యాయవాదులు ఎన్.హరికృష్ణ, జి.పద్మజ, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ యండ్లూరి ప్రభాకర్, విద్యావేత్త డాక్టర్ కోరాడ రామకృష్ణ ఉన్నారు. ఈ కార్యక్రమంలో శాశ్వత లోక్ అదాలత్ ఛైర్మన్ కె.శ్రీనివాసరావు, కళాశాల వ్యవస్థాపకులు ఎ.రామిరెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ రాఘవేంద్రచార్, వైస్ ప్రిన్సిపల్ ఎం.మహేష్, కళాశాల అధ్యాపకులు సిబ్బంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
కార్యక్రమంలో మాట్లాడుతున్న సీనియర్ సివిల్ జడ్జి దీన










