Oct 26,2023 21:43

ప్రారంభిస్తున్న మంత్రి కాకాణి

ప్రారంభిస్తున్న మంత్రి కాకాణి
రవాణా శాఖ సేవలు విస్తత పరుస్తాం
ప్రజాశక్తి-కావలి రూరల్‌ :రవాణా శాఖలో అమలవుతున్న వివిధ రకాల సేవలను విస్తతపరిచి మెరుగైన సలహాలు సూచనలు సేవలు అందేలా కషి చేయడం జరుగుతుందని మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి వెల్లడించారు. గురువారం కావలి మండల పరిధిలోని రుద్రకోట గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాన్ని మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి రవాణా శాఖ అధికారులతో కలిసి నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి డివిజన్‌ పరిధిలో వాహనదారులకు ప్రస్తుతం అమలవుతున్న కొన్ని సేవలు అందుబాటులో ఉండగా ఈ నూతన కార్యాలయం వాహనదారులకు సేవలు విస్తత పరిచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయడం జరుగుతుందన్నారు వివిధ రకాల ప్రజలకు వాహనదారులు ఎలాంటి సేవలు పొందాలన్నా కావలి ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో అందుబాటులో ఉండేలా కషి చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు రోడ్డు భద్రత ధ్యేయంగా భావించి ఈ కార్యాలయం అధికారులు కషి చేయడం జరుగుతుందని తెలిపారు. మెరుగైన వసతుల కల్పనకు ఉద్దేశించి విశాలమైన ప్రాంతంలో ఈ భవనాన్ని మంజూరు చేసి నిర్మించడం జరిగిందని అది తమ ప్రభుత్వ కషిలో భాగమేనని తెలిపారు.

కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో తన నియోజకవర్గంలోని అల్లూరు, దగదర్తి మండలాలు నెల్లూరు జిల్లా కేంద్రా పరిధిలో ఉండగా ఈ ప్రాంతీయ కార్యాలయంలో ఆ మండలాలకి సేవలు అందేలా కషి చేయాలని కోరారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్ర అభివద్ధి కోసం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజా సేవలో భాగంగా కషి చేస్తున్నారని తెలిపారు. కావలి నియోజకవర్గం అభివద్ధికి జిల్లా మంత్రి కాకాణి తో పాటు పలువురి మంత్రుల సహాయ సహకారాలు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తోడ్పాటుతో అభివద్ధి చేస్తున్నానని చెప్పారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం కావలికి అతి సమీపంలో ఉండగా ఈ నిర్మాణం పూర్తి దర్శకు చేరిందని తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పనతో పాటు కావలి ప్రాంత అభివద్ధికి దోహద పడుతుందని చెప్పారు. కార్యక్రమంలో రవాణా శాఖ అధికారి సుధాకర్‌ రెడ్డి, సుందర్‌ రావు, కరుణాకర్‌, మురళీమోహన్‌, ఆర్‌డిఒ ,ఏఎంసి చైర్మన్‌ సన్నిబోయిన ప్రసాద్‌, జెడ్‌పిటిసి సభ్యులు జంపని రాఘవులు, దామిశెట్టి సుధీర్‌ నాయుడు, గంధం ప్రసన్నాంజనేయులు, కనుమర్లపూడి నారాయణ, కామరాజు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు రుద్రకోట గ్రామస్తులు పాల్గొన్నారు.