రూ.కోటి 20లక్షలతో తరగతి గదులు
ప్రజాశక్తి- సోమల : మేజర్ పంచాయతీ కేంద్రమైన కందూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో కోటి 20లక్షల రూపాయలతో నాడు- నేడు పథకం కింద నిర్మించ తలపెట్టిన భవనాల నిర్మాణాలకు ప్రజాప్రతినిధులు గురువారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఈశ్వరయ్య మాట్లాడుతూ ఉన్నత పాఠశాలలో నూతనంగా 12గదుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని పనులు చేపట్టి గదులనిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బాష మసూద్, ప్రజాప్రతినిధులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.










