రూ.78 కోట్లతో ఆలయాల అభివృద్ధి
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ప్రజాశక్తి- పుంగనూరు: రూ.78కోట్లతో పుంగనూరు నియోజకవర్గంలో ఆలయాల అభివద్ధి చేపట్టడం జరిగిందని రాష్ట్ర విద్యుత్‌శాఖ, అటవీశాఖ, గనులశాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. స్థానిక కష్ణంరెడ్డిపల్లి సమీపంలో యాదవసంఘంచే నూతనంగా నిర్మించిన శ్రీకష్ణ ఆలయాన్ని కుటుంబసమేతంగా మంత్రి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోని రాగానే ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పురాతన ఆలయాలకు కోట్లాది రూపాయలు నిధులు విడుదల చేసి అభివద్ధి చేపట్టారని చెప్పారు. యాదవులు ఐక్యమత్యంతో శ్రీక్రిష్ణ ఆలయం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించడం చాలా సంతోషించదగ్గ విషయమని ప్రశంసించారు. ఈ సందర్భంగా యాదవసంఘ నాయకులు వెంకటరెడ్డి యాదవ్, సుబ్రమణ్య యాదవ్ ఆధ్వర్యంలో మంత్రి దంపతులకు ఘనస్వాగతం పలికి, గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, టీటీడీ బోర్డుమెంబరు పోకల అశోక్‌కుమార్, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లి కష్ణమూర్తి, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీమ్ బాషా, జెడ్పిటిసి జ్ఞానప్రసన్న, ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి, పార్టీ నాయకులు చంద్రారెడ్డి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.










