Sep 12,2022 23:25

రూ.77.62 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌ను వెంటనే ఖర్చు చేయాలి
గృహ నిర్మాణ పనులను వేగవంతం : కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో పలు భవనాల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వాటిని సకాలంలో పూర్తిచేయాలని అలాగే పాఠశాలలకు సంబంధించి నాడు-నేడు పనులకు, గహనిర్మాణ పనులకు అత్యంతప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని నిర్మాణాలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం.హరి నారాయణన్‌ అన్నారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ను ఎంపిడిఓలు, హౌసింగ్‌, ఎంఈఓలు, ఇతర శాఖలకు చెందిన ఇంజనీరింగ్‌ అధికారులతో జాయింట్‌ కలెక్టర్‌ నిర్వహించారు. ఈసందర్భంగా గహనిర్మాణ పనులు వేగవంతంగా చేయాలని లక్ష్యాలను చేరేందుకు ప్రణాళికలు రూపొందించుకొని వేగవంతం చేయాలన్నారు. నాడు-నేడు పనులకు సంబంధించి 620 పాఠశాలలకు అప్‌లోడ్‌ చేయాలని మరో 11 కళాశాలలకు సంబంధించి బిల్లులను అప్‌లోడ్‌ చేయాలన్నారు. అదేవిధంగా 5వేల వరకు హెడ్‌మాస్టర్‌లు డ్రాచేసి వుంచుకోవచ్చు ఆపై చేయరాదు. బ్లాంక్‌ చెక్‌ తమ వద్ద ఉంచుకోరాదని, వస్తువుల కొనుగోలు తర్వాతే చెక్కు ఇవ్వాలి, స్టాక్‌ రిజిస్టర్‌ తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ఇంజనీరింగ్‌ అధికారుల అంచనాల మేరకు నిర్మాణవస్తువులు కొనుగోలు చెయ్యాలి. చెట్లు తొలగించేటప్పుడు అనుమతి తీసుకోవాలని, అవసరం అయితే ఆ చెట్లను వాడుకోవచ్చు అని తెలిపారు. జగనన్న విద్యా కానుక పెండింగ్‌లో ఉన్నవాటిని పూర్తిగా ఇవ్వాలన్నారు. ార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌, జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, ఎస్‌ఎస్‌ఏ ఏపిసి వెంకటరమణారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ నాగజ్యోతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.