రూ.700కోట్లతో ఆవులపల్లె రిజర్వాయర్
పూర్తిస్థాయిలో రైతులకు, ప్రజలకు నష్టపరిహారం అందిస్తాం: మంత్రి పెద్దిరెడ్డి
ప్రజాశక్తి- సోమల: మండలంలో ఆవులపల్లె వద్ద దాదాపు రూ.700కోట్లతో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వాయర్ పనులను నాణ్యంగా వేగవంతంగా చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా రిజర్వాయర్ నిర్మాణం వలన భూములు, గ్రామాలు కోల్పోయే రైతులకు, ప్రజలకు నష్టపరహారం అందించే విషయంలో పూర్తిస్థాయిలో రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వం నుండి వారికి నష్టపరిహారం అందిస్తామని అన్నారు. మంత్రి వెంట రాష్ట్ర వైసీపీ కార్యదర్శి పెద్దిరెడ్డి, వరదం వెంకటరమణ ఉన్నారు.
తిరుమలకు బస్సును ప్రారంభించిన మంత్రి
పుంగనూరు: పుంగనూరు నుంచి తిరుమలకు వెళ్లే నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. శుక్రవారం పుంగనూరు బస్టాండ్‌లో సప్తగిరి ఎక్స్ప్రెస్ సర్వీసులను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి రవాణా సమస్యలు లేకుండా ఉండే విధంగా ఆర్టీసీ సేవలు అందిస్తుందన్నారు. నియోజకవర్గ ప్రజలకే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా ఆర్టీసీ రవాణా మెరుగైన సౌకర్యాలు అందించాలన్నారు. డిపో మేనేజర్ మాట్లాడుతూ సుధాకరయ్యా పుంగనూరు నుంచి తిరుమలకు ప్రస్తుతం ఆరు బస్సులతోపాటు అదనంగా మరో రెండు కొత్త ఎక్స్ప్రెస్ సర్వీసులు మంత్రిచే ప్రారంభించడం జరిగిందన్నారు. పుంగనూరు నుంచి తిరుమల వయా చౌడేపల్లి, సోమల, సదుం, కల్లూరు, పాకాల సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులను ఈరోజు నుండి ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం, కలకడ మండలాలు పరిసర ప్రాంత ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, మున్సిపల్ చైర్మన్ హలీంబాష, ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ముడా చైర్మన్ వెంకట్‌రెడ్డి యాదవ్, జానపద నత్యకళా చైర్మన్ నాగభూషణం, ఏఎంసీ చైర్మన్ నాగరాజు రెడ్డి, చంద్రారెడ్డి యాదవ్, వైఎస్సార్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు జయరామిరెడ్డి, డిపిటిఓ జితేంద్రనాథ్‌రెడ్డి, ఆర్టీసీ యూనియన్ నాయకులు కరీముల్లా, మల్లేశ్వర్, రెడ్డప్ప, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
వైయస్సార్సీపీకి తీరని లోటు : మంత్రి పెద్దిరెడ్డి
రొంపిచెర్ల: పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న నాయకులు మతిచెందడం వైయస్సార్సీపీకి తీరని లోటని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన గురువారం రాత్రి మతి చెందిన వైఎస్‌ఆర్సిపి నాయకులు దేవలపల్లి కష్ణారెడ్డి, రెడ్డప్ప నాయుడు మతదేహాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మతుల కుటుంబాలకు తాను జీవితాంతం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మతులను పరామర్శించిన వారిలో ఎంపీపీ పురుషోత్తం రెడ్డి, జెడ్పిటిసి రెడ్డిశ్వర్‌రెడ్డి, సర్పంచులు ఇబ్రహీంఖాన్, దేవలపల్లి నాగిరెడ్డి, అన్సర్ బాషా, వైయస్సార్సీపి నాయకులు చెంచురెడ్డి, వైయస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి సలీంబాష, సూర్యనారాయణరెడ్డి, సైఫుల్లాఖాన్, అమర్నాథ్‌రెడ్డి, చిన్ననాగరాజ, లక్ష్మయ్య, సీఐ ఆశీర్వాదం, ఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు.










