రూ.62 లక్షలతో పాఠశాల అభివృద్ధి పనులు
ప్రజాశక్తి- రామకుప్పం: మండలంలోని పంద్యలమడుగు గ్రామపంచాయతీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు- నేడు రెండవ దశలో అభివద్ధి పనుల కోసం గురువారం జడ్పిటిసి నితిన్ రాఘవ్ రెడ్డి, ఎంపిపి సుబ్రమణ్యం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. రూ.62 లక్షల 80వేలతో పనులు చేయటం జరుగుతుందన్నారు. వారు మాట్లాడుతూ పేదవారి బిడ్డలు చదువుకుంటున్న ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి ఆశయమన్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాల ల్లో చదివే వారికి ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం దుస్తులు, మధ్యా హన భోజనం, అమ్మఒడి వంటి వాటిని అందించి పేదపిల్లలకు విద్యను చేరువచేయడం అభినందనీయం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వేత రాంబాబు, ఎంపీటీసీ నాగభూషణం, పాఠశాల చైర్మన్ లోకనాథం బాలాజీ, పాఠశాల వైస్‌చైర్మన్ మద్దమ్మ, వైస్‌సర్పంచ్ రాము, మురుగేష్ వార్డు మెంబర్ మురళి, తదితరులు పాల్గొన్నారు.










