Sep 10,2022 22:59

రూ.30కోట్లతో 7వేల ఇండ్లకు తాగునీరు
వచ్చే ఏడాది మే నాటికి కనెక్షన్లు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

సుదీర్ఘ కాలం తాగునీటి కోసం అష్టకష్టాలు పడ్డ చిత్తూరువాసులు నీటికష్టాలు తీరనున్నాయి. గత నాలుగేళ్ళుగా కురుస్తున్న వర్షాలతో చిత్తూరు వాసుల నీటికష్టాలు కొంత మేరకు తీరాయి. ఎన్‌టిఆర్‌ జలాశయం ఏటా వర్షాలతో నిండి నగరవాసుల నీటికష్టాలను తీరుస్తోంది. దీనికి తోడు భూగర్భ జలాలు పెరిగాయి.
చిత్తూరు నగరం చుట్టు ఉన్న కట్టమంచి, గంగనేని, కాజూరు చెరువులు ఏటా వర్షాకాలంలో నిండుతున్నాయి. నాలుగేళ్ల క్రితం చిత్తూరు అంటే తాగునీటి కష్టాలు గుర్తుచేవి. నగర పాలక సంస్థ 70కి పైగా నీటి సరఫరా ట్యాంకర్ల ద్వారా నగరంలోని అనేక కాలనీలకు నీటి సరఫరా చేసేది. అద్దె ట్యాంకర్లు ఒక్క ట్యాంకర్‌ నీటికి రూ.400, 500లు తీసుకొనే వారు. నీటి కష్టాల ప్రభావం ఇంటి నిర్మాణాలపై కూడా పడేది. శుద్ధినీటిని అందించేలా నగర పాలక సంస్థ నగరంలో 12ప్రాంతాల్లో మినరట్‌ వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. నిర్వహణ ఖర్చుల పేరిట బిందెకు రెండు రూపాయాలు వసూలు చేస్తున్నారు.
ఏడు వేల ఇండ్లకు నీటి కన్షెన్లు
జలజీవన్‌ మిషన్‌ అమృత్‌ స్కీల్‌ల నిధులు రూ.30కోట్ల ఖర్చుతో చిత్తూరు నగరంలో 7వేల ఇండ్లకు నీటి కన్షెన్లు ఇవ్వన్నారు. ఇందు కోసం చిత్తూరు నగరంలోని కైలాసపురం వద్ద 2,000 కే.ఎల్‌, 1500 కేఎల్‌ కెపాసిటి కలిగిన భారీ నీటి స్టోరేజీ ట్యాంకులు నిర్మించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో అడవిపల్లి రిజర్వాయర్‌ నుంచి పైపులైన్‌ ద్వారా చిత్తూరు నీటికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. కొంతమేరకు పైపులైన్‌ పనులు కూడా జరిగాయి. ప్రభుత్వం మారడంతో పైపులైన్‌ పనుల బ్రేక్‌ పడింది. తిరిగీ 68 కిలోమీటర్ల పైపులైన్‌ నిర్మాణం పూర్తి చేసి అడవిపల్లి రిజర్వాయర్‌ నీటిని చిత్తూరు వరకు తీసుకురానున్నట్లు మున్సిపల్‌ అధికారులు చెబుతున్నారు. కండలేరు నుండీ పైపులైన్‌ ద్వారా చిత్తూరు కైలజపురం వద్ద నిర్మించే ట్యాంకుల్లో నీటిని నింపి అక్కడి నుండీ పైపులైన్‌ ద్వారా గృహాలకు నీటిని సరఫరా చేయనున్నారు.
వారం రోజుల క్రితం కైలసపురం వద్ద ట్యాంకుల నిర్మాణానికి ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ అధికారులు ట్యాంకుల నిర్మాణాని భూమి పూజచేసి ప్రారంభించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌, మేనాటికి పైపులైన్ల నిర్మాణంతో పాటు ట్యాంకుల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వ లక్ష్యం మేరకు మేనాటికి అడవిపల్లి నుంచి చిత్తూరు వరకు పైపులైన్ల నిర్మాణం జరిగి, ట్యాంకుల నిర్మాణం పూర్తి చేస్తే చిత్తూరు నగరంలోని ఏడు వేల ఇండ్లకు తాగునీటి కన్షెన్‌ ఇచ్చే అవకాశం ఉటుందని మున్సిపల్‌ నీటి సరఫరా విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. ఏడు వేల నీటి కన్షెన్లు ఇస్తే నగరంలో దాదాపు వందశాతం తాగునీటి కన్షెన్లు పూర్తి అవుతాయంటున్నారు.
నగర వాసులు నీటి కష్టాలు తీరుతారు
- గోపాల్‌రెడ్డి, పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌సి
అడవిపల్లి రిజర్వాయర్‌ నుండీ చిత్తూరు వాసుల నీటి కష్టాలను తీచ్చేలా అమృత్‌, జలజీవన్‌ మిషన్‌ నిధులు రూ. 30కోట్లతో పైపులైన్లు, ట్యాంకుల నిర్మాణం చేపడుతున్నట్లు పబ్లిక్‌ హెల్త్‌ చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల ఎస్‌సి గోపాల్‌రెడ్డి తెలిపారు. అసంపూర్ణంగా ఉన్న పైపులైన్ల నిర్మాణంతో పాటు ట్యాంకుల నిర్మాణం కూడా ఒకేసారి చేపట్టడం జరుగుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌, మే నాటికి చిత్తూరు కైలసపురం వద్ద నిర్మిస్తున్న ట్యాంకులకు నీటిని తీసుకురానున్నాం. ఆలోపు చిత్తూరు నగరంలో కులాయి కన్షెన్లు లేనివారిని గుర్తించి నీటి కన్సెన్‌ కోసం కొత్త పైపులైన్లు ఏర్పాటు చేస్తాం. దాదాపు ఏడు వేల ఇండ్లకు అడవిపల్లి రిజర్వాయర్‌ నీటిని అందిచేలా లక్ష్యంలో నిధులు ఖర్చు చేయడం జరుగుతోంది.