ప్రజాశక్తి-అనంతపురం 2024 మార్చి నాటికి రూ.2500 కోట్లు లక్ష్యంగా సిబ్బంది పని చేయాలని ఎడిసిసి బ్యాంక్ ఛైర్‌పర్సన్ లిఖిత సూచించారు. మంగళవారం నగరంలోని జిల్లా సహకార కేంద్రం బ్యాంకు ప్రధాన కార్యాలయంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లు రూ.52 కోట్లు అన్నారు. ప్రస్తుతం బ్యాంకు వ్యాపారం రూ.1,721 కోట్లు ఉండగా మార్చి 2024 నాటికి రూ.2,500 కోట్ల లక్ష్యానికి చేరాలన్నారు. మార్చి 2023 నాటికి అడ్వాన్స్ మొత్తం రూ.1,105 కోట్లు ఉండగా మార్చి 2024 నాటికి రూ.1800 కోట్లు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం బ్యాంకు నికర లాభం రూ.1.4కోట్లు ఉండగా మార్చి 2024 నాటికి రూ.20 కోట్లు లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే స్వయం సహాయక బృందాలకు జాయింట్ గ్రూపులకు గవర్నమెంట్ పథకాలకు విరివిగా రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పాలకవర్గ సభ్యులు శంకర్‌రెడ్డి, రామాంజనేయులు, హైదర్‌వలీ, కారుణ్య జనార్ధన్‌రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, బ్యాంకు సీఈవో విబి రాంప్రసాద్, జనరల్ మేనేజర్ సురేఖారాణి, ఒఎస్‌డి దినేష్‌కుమార్, చార్టర్ అకౌంటెంట్ రవిశంకర్‌రెడ్డి, డిజిఎం సుఖదేవబాబు, రవికుమార్, సీనియర్ అధికారులు, డైరెక్టర్లు రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఎడిసిసి బ్యాంకు ఛైర్‌పర్సన్ లిఖిత










