
* డిసిసిబి సిఇఒ వరప్రసాద్
ప్రజాశక్తి - సోంపేట: డిసిసిబి రూ.2,300 కోట్ల టర్నోవర్ చేస్తోందని ఆ బ్యాంకు సిఇఒ డి.వరప్రసాద్ తెలిపారు. స్థానిక డిసిసిబి బ్రాంచ్ వద్ద డిపాజిట్ల సేకరణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోంపేట బ్రాంచ్ రూ.వంద కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగా ఒక్కరోజు రూ.1.12 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు తెలిపారు. పలు రైతుసంఘాలకు, రైతులకు నిబంధనల మేరకు రూ.కోటి వరకు రుణాలు సైతం మంజూరు చేశామన్నారు. డిసిసిబి ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నోడల్ అధికారి జి.మురళీధర్, బ్రాంచ్ మేనేజర్లు చంద్రశేఖరం, హేమసుందర్, తులసీబాయి, బి.రామారావు, ఎస్.నారాయణరావు, పిఎసిఎస్ అధ్యక్షుడు రౌతు విశ్వనాథం, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.