Jul 02,2022 22:52

రూ.10 లక్షలు విలువ చేసే
మద్యం, నాటు సారా ధ్వంసం
జెసిబితో నిర్వీర్యం చేసిన పోలీసులు
ప్రజాశక్తి- కార్వేటినగరం

జిల్లా ఎస్‌పి, డిప్యూటీ కమిషనర్‌ ఆదేశాల మేరకు జిల్లా అసిస్టెంట్‌ ఎన్ఫోర్స్మెంట్‌ సూపరింటెండెంట్‌ అయేషా బేగంతో సమక్షంలో శనివారం రూ.10లక్షలు విలువ చేసే మద్యం నాటుసారాను జెసిబి సాయంతో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్వేటినగరం సర్కిల్‌లోని కార్వేటినగరం, వెదురుకుప్పం, ఎస్‌ఆర్‌పురం పోలీసు స్టేషన్లతోపాటు నగిరి అర్బన్‌, నగరిరూరల్‌, సర్కిల్లోని నిండ్ర, విజయపురం, కార్వేటినగరం ఎస్‌ఇబి, నగిరి ఎస్‌ఇబి స్టేషన్లలో నమోదు అయిన 185 ఎక్సైజ్‌ కేసులను ముద్దయిల వద్ద నుండి స్వాధీనం చేసిన సుమారు రూ.10లక్షలు విలువ చేసే వివిధ రకాలైన 4327 మద్యం బాటిల్స్‌ 356 లీటర్ల నాటుసారాయిని కార్వేటినగరం సుబ్రమణ్య స్వామి గుడి సమీపంలో అటవీ ప్రాంతంలో ఉన్న గుట్ట వద్ద బాటిల్స్‌ను, నాటుసారాను నాశనం చేసినట్లు సీఐ చంద్రశేఖర్‌, నాగరాజులు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు దస్తగిరి, గోపి, షేక్‌షావలి, జయశంకర్‌, భాస్కర్‌, భానుప్రకాష్‌, సిబ్బంది పాల్గొన్నారు.