May 25,2023 21:20

ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి
ప్రజాశక్తి - పాలకొల్లు
రోహిణీ కార్తే తొలిరోజు గురువారం ఎండ ప్రభావం తీవ్రంగా ఉంది. ఎండ మధ్యాహ్నం ఎక్కువగా ఉండటంతో పట్టణంలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. దీంతో వ్యాపారులు మధ్యాహ్నం షాపులు మూసివేశారు. పలు ప్రభుత్వ కార్యాలయాలు సెలవు రోజులా వెలవెల బోతున్నాయి. ఎండతీవ్రత, ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.