Jun 28,2022 22:10

రోడ్ల నిర్మాణం జరగాలంటే భూసేకరణ చాలా అవసరం
19 మండలాల్లో పెండింగ్‌ భూసేకరణ పూర్తి: కలెక్టర్‌

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: రాష్ట్ర అభివద్ధికి పలు రోడ్ల నిర్మాణానికి భూసేకరణ అవసరమని పకడ్బందీగా నిర్వహించాలని మరోముడు రోజులలో భూసేకరణ చేయాల్సి ఉన్న 18 మండలాలలో వేగవంతంచేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌, డిఆర్‌ఓ రాజశేఖర్‌లతో కలసి వీడియోకాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రెండు జాతీయ రహదారులు వెళ్తున్నాయని వీటికి సంబంధించి భూసేకరణ కొంత చేశామని ఇంకా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తీ చేయాలన్నారు. పారదర్శకంగా, వేగంగా నిర్వహించాలన్నారు. గతవారం నాడు 25.31కోట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కోర్టు కేసులు మినహా అన్ని ఫైళ్లు 30వతేదీ లోపున పూర్తిచేయలన్నారు. రీసర్వే కార్యక్రమానికి డ్రోన్‌ ఫ్లై కార్యక్రమానికి సంబంధించి 88 గ్రామాలకు ఓఆర్‌ఐ షీట్లు రావడం జరిగిందని గ్రౌండ్‌ ట్రూథింగ్‌, కోరినేషన్‌, వాలిడేషన్‌ ప్రక్రియలో ఎటువంటి తప్పులు లేకుండా చూడాలని వాలిడేషన్‌లో సమస్యలు ఉంటే మొబైల్‌ కోర్టు ద్వారా పరిష్కరించాలన్నారు. డ్రోన్‌ ఫ్లై జరిగే సమయం ఎక్కువగా ఉండాలని తద్వారా ఎక్కువసర్వే జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వే ఇన్స్పెక్టర్‌ లత, ఎస్డిసీ పర్వీన్‌ పాల్గొన్నారు.