Sep 19,2023 21:23

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ప్రజాశక్తి-పెద్దపంజాణి:

మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు మండలంలోని నాగిరెడ్డిపల్లి పంచాయతీ సల్లాఊరు గ్రామానికి చెందిన వెంకటాద్రి (16) తన ద్విచక్ర వాహనంలో వస్తుండగా ముత్తుకూరు క్రాస్‌ వద్ద బొలేరో వాహనం ఢకొీనడంతో మతి చెందినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై టి. శ్రీనివాసులు తెలిపారు.