రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మంజునాథ
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్:
పోలీసుల వివరాల ప్రకారం మదనపల్లి పట్టణం తమ్మినేని వీధిలో కాపురముంటున్న మంజునాథ తన సొంత పనిపై ద్విచక్ర వాహనంలో కర్ణాటకలోని లక్ష్మీపురం క్రాస్ వద్దకు వెళ్ళి తిరిగి వస్తుండగా కొరికేపల్లి క్రాస్ వద్ద ఎదురుగా వచ్చిన ఓ స్కూటరిస్టు బైకును ఢకొీని వెళ్ళిపోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన బాధితున్ని కర్ణాటక 108 సిబ్బంది చికిత్స నిమిత్తం మదనపల్లిజిల్లా ఆస్పత్రికి తరలించారు. వాయల్పాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.










