ప్రజాశక్తి-చౌడేపల్లి : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు గాయపడిన సంఘటన ఆదివారం చౌడేపల్లిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చౌడేపల్లి నాగిరెడ్డిపల్లి ప్రధాన రహదారిలో నాగిరెడ్డి పల్లి నుంచి చౌడేపల్లి వైపు వస్తున్న ఓ స్కూటర్అదుపు తప్పి ఎదురుగా నిలబడి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో నాగిరెడ్డి పల్లికి చెందిన భాను ప్రకాష్ రెడ్డి 25 తలపై బలమైన గాయం తగిలింది. అతనిని స్థానికులు చౌడేపల్లి ఆరోగ్య కేంద్రానికి తీసుకురాగా ఇక్కడ అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా స్కూటర్ పై వస్తున్న భాను ప్రకాష్ రెడ్డి కంటిలో ఈగ పడినందున ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.










