Apr 28,2023 21:59

మృతిచెందిన రవికుమార్‌

         గుత్తి : మండలంలోని కొత్తపేట గ్రామం వద్ద 67వ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఉపాధ్యాయుడు మృతిచెందాడు. విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని గాజులపల్లి గ్రామానికి చెందిన రవికుమార్‌ (30) పట్టణంలోని శ్రీసాయి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఈనేపథ్యంలో విదులు ముగించుకుని 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని మనీషా ద్విచక్ర వాహనంలో ఎక్కించుకుని వస్తుండగా కొత్తపేట గ్రామంలోని నాలుగు వరుసల రహదారి వంతెన వద్దకు రాగానే కర్నూలు నుంచి వస్తున్న ట్యాంకరు ఢకొీంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఉపాధ్యాయుడు రవికుమార్‌ అక్కడికక్కడే మరణించాడు. మనీషాకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే గాయపడ్డ విద్యార్థినికి చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.