Mar 15,2022 22:36

మృతి చెందిన వెంకటరమణ నాయక్‌



ప్రజాశక్తి- కలకడ:
పోలీసులు సమాచారం మేరకు మండలంలోని దిగువతండా పంచాయతీ ఎగువ తండాకు చెందిన మూడే తులసీ నాయక్‌ కుమారుడు మూడే వెంకటరమణ నాయక్‌ (36) తిరుమలలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తూ మంగళవారం స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా పాపిరెడ్డిగారిపల్లి-ముడియంవారిపల్లి మార్గమధ్యలో గుర్తు తెలియని వాహనం డీకోనడంతో వెంకటరమణ నాయక్‌(36) తలకు బలమైన రక్తగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు, పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన వెంకటరమణ నాయక్‌కు భార్య సరితబారు, కుమారుడు రోహిత్‌నాయక్‌, కుమార్తె హిమజ ఉన్నారు. మృతుడి భార్య సరితబారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.