Mar 27,2022 23:17

మృతి చెందిన వినాయకం


ప్రజాశక్తి-ఎస్‌ఆర్‌ పురం:
ఎస్‌ఆర్‌పురం ఎస్‌ఐ షేక్షావలి కథనం మేరకు ఎస్‌ఆర్‌పురం మండలంలోని కటికపల్లి గ్రామ పంచాయతీ ఒడ్డుపల్లి గ్రామానికి యేసయ్య కుమారుడు వినాయకం(34) ద్విచక్ర వాహనంపై స్వగ్రామం ఒడ్డుపల్లి నుండి తెల్లగుండ్లపల్లిలోని అత్తగారింటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయితే తనకు తానుగా అదుపుతప్పి బోల్తా పడ్డాడా లేక ఏదైనా గుర్తుతెలియని వాహనం ఢకొీనిందా అన్న విషయం పోలీసుల విచారణలో తెలియాల్సిఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ షేక్షావలి తెలిపారు.