రోడ్డు ప్రమాదంలో
ఇద్దరు విద్యార్థులు దుర్మరణం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతిచెందిన సంఘటన శనివారం చిత్తూరు నగరపాలక పరిధిలోని దొడ్డిపల్లి ఓవర్ బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. తాలూకా పోలీసుల వివరాల మేరకు ఎస్వీసెట్ ఇంజనీరింగ్ కళాశాల బిటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నెల్లూరు జిల్లా గుడూరు చిల్లకూరు మండలం పున్నపువారిపాలెం గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య కుమారుడు టి.మస్తాన్ (21), అనంతపురం జిల్లాకు చెందిన చైతన్య (19)లు బిటెక్ ద్వితీయ సంవత్సరం ఎస్వీసెట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఐటి డిఎఎ చదువుతున్నారు. ఇద్దరు ఒకే జిల్లా కావడంతో స్నేహితులా కలసి తిరిగేవారు. శనివారం కళాశాల్లో నిర్వహించిన సెమిష్టర్ పరీక్ష రాసిన ఇద్దరు కళాశాల నుండీ పల్‌సర్ ద్విచక్రవాహనంలో చిత్తూరుకు వస్తుండగా దొడ్డిపల్లివద్ద ఉన్న ప్లైఓవర్ బ్రిడ్జిపై డివైడర్‌ను ఢకొీన్నారు. ఈఘటనలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహాలను శవపంచనామా కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.










