రోడ్డు ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరించొద్దు
టిడిపి నేతలపై వైసిపి ఆగ్రహం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ఆదివారం పూతలపట్టు మండలం బికొత్తకోట వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులతో పాటు డ్రైవర్ మృతి చెందగా మరో ఇద్దరు పోలీసులు చికిత్స పొందుతున్నారని ఈ సంఘటనపై తెలుగుదేశం నాయకులు ఎల్లో మీడియా ప్రచార మాధ్యమాల్లో జిల్లాలోని ఓప్రముఖ వైసిపి నాయకుడు గంజాయి స్మగ్లింగ్ విషయంలో పోలీసు వాహనాన్ని కారుతో ఢకొీన్ని హత్యచేశారంటూ అసత్య ప్రచారం చేస్తున్నట్లు వైసిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్తూరు ఎంఎల్‌ఎ ఆరణి శ్రీనివాసులు, చుడా ఛైర్మెన్ పురుషోత్తంరెడ్డి, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉద్ధేశపూర్వకంగా వైసిపి నాయకులపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్న టిడిపి నేతలు వారి ప్రచారమాధ్యాలు సాక్షాలుంటే నిరూపించాలని సవాలు చేశారు. అలాగే వర్గాలు, వర్గపోరు అంటూ అసత్య ప్రచారం మానుకోవాలని సూచించారు. ఇలాంటి అలత్య ప్రచారం చేస్తున్న టిడిపినేతలకు ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకొనే సత్తాలేని టిడిపి వైసిపి నేతలపై అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో వైసిపి నాయకులు సంపత్, కృష్ణారెడ్డి, కార్పోరేటర్లు పాల్గొన్నారు.










