రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
చిత్తూరు ఏఎస్పీ శ్రీనివాసరావు
ప్రజాశక్తి- వికోట
జాతీయ రహదారుల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చిత్తూరు అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం పలమనేరు నుంచి కుప్పం వరకు గల జాతీయ రహదారుల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించారు. ప్రమాదకర మలుపుల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులకు సూచనలు చేశారు. మండలపరిధిలో ఇప్పటికే గుర్తించిన బ్లాక్‌స్పాట్స్ రాఘవపల్లె, కుమ్మరమడుగు, దానమయ్య గారిపల్లె, కష్ణాపురం, జవ్వునిపల్లె, దాసార్లపల్లె, గంధారమాకులపల్లె, అన్నవరం క్రాస్‌ల వద్ద రోడ్డు ప్రమాదాలు ఎలా నివారించాలన్న అంశంపై చర్చించారు. ఆయన వెంట చిత్తూరు బిటిఆర్బీ ఇన్స్పెక్టర్ నరసింహులు, వి.కోట సిఐ ప్రసాద్‌బాబు, ఎస్సై రాంభూపాల్, ఏఎస్‌ఐ జయకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.










