Oct 18,2023 19:37

రొమ్ము కేన్సర్‌పై అవగాహన

మాట్లాడుతున్న రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పి.చంద్రశేఖర్‌రెడ్డి
రొమ్ము కేన్సర్‌పై అవగాహన
ప్రజాశక్తి-నెల్లూరు:రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాన్సర్‌ వైద్యశాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పి.చంద్రశేఖర్‌రెడ్డి సూచనల మేరకు క్యాన్సర్‌ హాస్పిటల్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ టి. లక్ష్మి, (ఎం.బి.బి.ఎస్‌., డి.జి.ఒ.) కన్సల్టెంట్‌ గైనకాలజిస్ట్‌ అధ్యక్షతన బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ అక్టోబర్‌ నెలను రొమ్ము క్యాన్సర్‌ అవగాహన నెలగా పరిగణించి రొమ్ము క్యాన్సర్‌ కోసం అంకితం చేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందన్నారు. స్త్రీలలో వచ్చే క్యాన్సర్లలో రొమ్ము కాన్సర్‌ ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నదాని, ప్రతి నలుగురిలో ఒకరు క్యాన్సర్‌ బారిన పడుతున్నారన్నారు.
జీవనశైలి మారటం జంక్‌ ఫుడ్‌, ఆహారపు అలవాటులు, ఊబకాయము, వ్యాయామం లేకపోవటం ముఖ్యమైన కారణమన్నారు. ప్రస్తుతం ఈ రొమ్ము క్యాన్సర్‌ 30 నుంచి 40 సంవత్సరాల మధ్య స్త్రీలలో ఎక్కువగా వవస్తున్నదని, దీనిని నివారించుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్క్రీనింగ్లు, వైద్య పరీక్షల గురించి తెలియజేశారు. 20 సంవత్సరాలు పైబడిన స్త్రీలు ఎవరికివారు వారి రొమ్ములను పరీక్షించుకొనటం, 30 సంవత్సరాల పైబడిన వారు సంవత్సరానికి ఒకసారి డాక్టర్ను సంప్రదించడం స్క్రీనింగ్లు మొదలగునవి తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. 40 సంవత్సరాలు స్త్రీలు రొమ్మును స్పెషల్‌ ఎక్స్‌రే , మెమోగ్రామ్‌, వివాహిత స్త్రీలు సంవత్సరంలో ఒకసారి తెల్లమైలు పరీక్ష అనగా ప్యాప్‌ పరీక్ష చేయించుకుని, డాక్టర్ని సంప్రదించడం వలన ఈ క్యాన్సర్‌ ను ముందుగా చాలా వరకు అరికట్టవచ్చునని సూచించారు. ఈ జాగ్రత్తలు పాటించడం వలన రొమ్ము క్యాన్సర్‌ ను కట్టడి చేయవచ్చుని, ఆరంభం దశలోనే గుర్తించి చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయవచ్చును తెలిజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ ప్రముఖ వైద్యులు డాక్టర్‌ ఎం. నాగేశ్వర రావు, (ఎంఎస్‌, ఎంసిహెచ్‌) సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌, డాక్టర్‌ గీతా ఉషశ్రీ (ఎండి) రేడియషన్‌ ఆంకాలజిస్ట్‌, డాక్టర్‌ ఏ. లోకేశ్వరి (ఎండి), రేడియషన్‌ ఆంకాలజిస్ట్‌, డాక్టర్‌ ఎం. హేమంత్‌, మెడికల్‌ ఆంకాలజిస్ట్‌, డాక్టర్‌ ఆర్‌.ఇ.ఎ.ముత్తు, సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, డాక్టర్‌ హరితా రాణి, రేడియాలజిస్ట్‌, క్యాన్సర్‌ యొక్క లక్షణాలు, క్యాన్సర్‌ నివారణకు తగిన సూచలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం.డి.జుబేర్‌, కన్వినర్‌, కమలేశ్‌ జైన, కో-కన్వినర్‌ రెడ్‌ క్రాస్‌ సిబ్బంది పాల్గొన్నారు.